హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ ఇసుక తవ్వకాలపై కేసులు: MRO

KDP: పెన్నా పరీవాహక ప్రాంతాల్లో అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేసి, యంత్రాలు సీజ్ చేస్తామని MRO విజయకుమార్ హెచ్చరించారు. మూలపల్లి, జంగాలపల్లి, ఎస్.రాజంపేట, వంతాటిపల్లి, జ్యోతి, గాండ్లపాలెం, సిద్ధవటం బ్రిడ్జి సమీపంలో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఇసుకను గృహ నిర్మాణ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు.