హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కుటుంబాల మధ్య రసవత్తర పోరు

KKD: పిఠాపురం మండలం మల్లం గ్రామ సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. బరిలో నలుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ ఇద్దరు జనసేన నేతల కుటుంబాల మధ్యే సాగుతోంది. జడ్పీ చైర్‌పర్సన్ బుర్రా దివ్య సునీతరాజ్ అత్త నాగవేణి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు భార్య అనురాధ పోటీలో ఉండటంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.