కర్నూలు సమీపంలోని పసుపుల మిలిటరీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మేకల మేత కోసం చెట్టు ఎక్కిన 13 ఏళ్ల సిద్దుకు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై కిందపడ్డాడు. స్థానికులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో 13 ఏళ్ల బాలుడు మృతి


