ELR: ఉంగుటూరు మండలంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. మండలంలోని 23 పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముగియగానే సిబ్బంది గేట్లు మూసివేశారు. ఒంటిగంట తర్వాత లోపలికి ఎవరినీ అనుమతించలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించి కాపలా కాశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరు మండలంలో పోలింగ్ ముగిసింది


