AKP: అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్నికల సందడి కొనసాగుతున్న వేళ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్


