ప్రకాశం: ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆదివారం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులు పూర్తయితే పార్టీ నాయకులకు కార్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'టీడీపీ ఆఫీస్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి'


