హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న లోకాయుక్త ఛైర్మన్

కోనసీమ: మండపేట మండలంలోని వెలగతోడు గ్రామంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఛైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన దంపతులకు నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.