హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్ దూకుడు.. టీమిండియాకు టెన్షన్!

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట పూర్తి అయింది. ఆట నిలిచే సమయానికి కివీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 133/3 స్కోర్ చేసింది. డెవాన్ కాన్వే (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. రచిన్ రవీంద్ర (46), మిచెల్ (5) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు పడ్డాయి. సుందర్ ఒక వికెట్ తీశాడు. కివీస్ జట్టు ప్రస్తుతం 243 పరుగుల ఆధిక్యంలో ఉంది.