టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ధోనీతో ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. ధోనీ సూచించిన ఫీల్డింగ్ మార్పులను పట్టించుకోకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలిపాడు. ‘నేను 300కు పైగా వన్డేలు ఆడింది ఊరికేనా?’ అంటూ మందలించడంతో భయపడ్డానన్నాడు. ధోనీ చెప్పిన వ్యూహాన్ని అమలు చేయగా కుశాల్ పెరీరా వికెట్ లభించిందని వెల్లడించాడు.
క్రీడలు
ధోనీ కోపానికి భయపడ్డా: కుల్దీప్ యాదవ్


