హైదరాబాద్: 28°C
క్రీడలు

బుమ్రాకే రెండో వికెట్‌

క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌పై భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో వికెట్ సాధించాడు. హెన్రీ నికోల్స్ (22)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో 17.3 ఓవర్లలో కివీస్ 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 63/2గా ఉంది. డేవన్ కాన్వే (32*)తో పాటు రచిన్ రవీంద్ర క్రీజులో ఉన్నారు. కివీస్ లీడ్ 173 పరుగులకు చేరింది.