హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆకాష్ దీప్ స్థానంలో కంకషన్ సబ్‌గా ప్రసిద్ధ్

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ రెండో టెస్టు మూడో రోజు కంకషన్ సబ్‌గా ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడని, వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోందని బీసీసీఐ తెలిపింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆకాష్(29), బ్యాటింగ్‌లో జేమీసన్ బంతులు రెండుసార్లు హెల్మెట్‌కు తాకడంతో రెండో ఇన్నింగ్స్ బౌలింగ్‌కు దూరమయ్యాడు. సిరాజ్‌ను పక్కన పెట్టడంపై విమర్శలున్నా అతడికి ఛాన్స్ దక్కలేదు.