హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టీమిండియా ఆలౌట్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 116/6తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ మరో 130 పరుగులు జోడించింది. భారత బ్యాటర్లలో ధ్రువ్ జురెల్ (88) ఒంటరి పోరాటం చేశాడు. అతడికి ఆకాశ్‌దీప్ (29) సహకారం అందించాడు. భారత్ ఇంకా 110 పరుగుల వెనుకంజలో ఉంది.