హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో కొండను కమ్మేసిన పొగ మంచు

ATP: రాయదుర్గం పట్టణంలో చలి తీవ్రత పెరిగింది. ఆదివారం ఉదయం పట్టణంలో కోటలో కొండ ప్రాంతాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో ఒక్కసారిగా చలి గాలుల తీవ్రత పెరిగింది. కొండ ప్రాంతానికి దగ్గరగా ఉన్న నివాసాలు సైతం పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలి తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.