హైదరాబాద్: 28°C
క్రీడలు

సిరాజ్ ఎంపికపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరాజ్ ఎంతో ఉత్సాహంగా, అంకితభావంతో ఆడే ఆటగాడని, అతడిని పక్కనపెట్టడం బాధాకరమని అన్నారు. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో 11 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీసిన సిరాజ్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై క్రికెట్ అభిమానుల్లో చర్చ మొదలైంది.