CTR: పలమనేరు మండలంలోని కల్లాడు రోడ్డు అధ్వానంగా మారింది. కొత్తగా రోడ్డు నిర్మాణం కోసం మట్టి పోశారు. అయితే ఇటీవల తరచూ కురుస్తున్న వర్షాలకు రోడ్డు చిత్తడిగా మారింది. ఈ రోడ్డుమీద గ్రామస్థులు నడవాలంటే భయపడుతున్నారు. ఇక ద్విచక్ర వాహనదారులు బురద కారణంగా జారి పడిపోతున్నారు. రోడ్డు పూర్తిస్థాయి నిర్మాణం చేసే వరకు కష్టాలు తప్పవని గ్రామస్థులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్వం బురదమయం.. ఇబ్బందుల్లో వాహనదారులు


