హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యక్తి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

CTR: రామకుప్పం మండలం పల్లికుప్పం పంచాయతీ కవ్వంపల్లికి చెందిన పి.చెంగప్ప (50) ఈనెల 24 నుంచి కనిపించడం లేదు. ఇంటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుమార్తె మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మతిమరుపు సమస్య ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9154424948, 7993410449 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.