హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి శైలజానాథ్ గృహనిర్బంధం

ATP: సింగనమల నియోజకవర్గంలో ఆదివారం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ సమన్వయకర్త డా. శైలజానాథ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెల్లవారుజామున 5 గంటలకే సుమారు 20 మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.