హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బి. కొత్తకోటలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపు

అన్నమయ్య: బి. కొత్తకోట మోడల్ స్కూల్‌లో నవంబర్ 30న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.