హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూచిపూడిలో ఆకర్షణీయంగా మోడల్ పోలింగ్ కేంద్రం

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పుష్పగుచ్ఛాలు, స్వాగత తోరణాలతో పోలింగ్ కేంద్రాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. ఓటర్లకు ఘన స్వాగతం పలికేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు కల్పించారు.