హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DEC 6 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 నుంచి 14 వరకు జరగనున్నాయి. టీటీడీ జేఈవో శరత్, గోపీనాథ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, అన్నప్రసాదం, తాగునీటి సరఫరాపై సూచనలిచ్చారు. డిసెంబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పంచమి తీర్థానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.