అల్లూరి: భీరం పంచాయతీలో ఎన్నికల వేళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సలీమారెంగి గ్రామం నుంచి భీరం వస్తుండగా ఘాట్ రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వంతల నాగేశ్వరరావు (32) అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వెళ్తున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఆటోలో ఓటేసేందుకు వెళ్తూ బోల్తా.. ఒకరి మృతి!


