హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్పి పరిశీలన

GNTR: తెనాలి మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఆదివారం ఉదయం సంగం జాగర్లమూడి, అంగలకుదురు తదితర గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. డీఎస్పీ జనార్ధనరావు, సీఐ నాయబ్ రసూల్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.