KDP: వేంపల్లి, పెండ్లిమర్రి, వీరపునాయనపల్లె మండలాల్లో పోలీసుల అండతో టీడీపీ కార్యకర్తలు పోలింగ్లో జోక్యం చేసుకుంటున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ఏజెంట్ల ఫారాలు లాక్కొని బయటకు పంపించారని, నిజమైన ఓటర్లను అడ్డుకుంటూ దొంగ ఓట్లు వేయిస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లను అడ్డుకుంటూ దొంగ ఓట్లు వేస్తున్నారు: MP


