హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా రెండో విడత పంచాయతీ పోలింగ్

PLD జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 52 పంచాయతీల పరిధిలో ప్రశాంతంగా సాగుతోంది. ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పోలింగ్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసు శాఖ భరోసా ఇచ్చింది.