హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిథిల భవనంలో గంగలకుర్రు పోలింగ్ కేంద్రం

కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రు మామిడి తోట వద్ద ఉన్న శిథిలమైన పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులోకి వెళ్లేందుకు ఓటర్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఓటు వేస్తున్నారు. అధికారులు ముందుగా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలింగ్ కేంద్రాన్ని మార్చాలని వారు కోరుతున్నారు.