హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత.. నిలిచిపోయిన పోలింగ్

ప్రకాశం: తాళ్లూరు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. నాగంబొట్లపాలెంలోని పోలింగ్ కేంద్రంలోకి కొందరు ప్రవేశించి బ్యాలెట్ బాక్సులో ఇంకు పోశారని తెలుస్తోంది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. మరోవైపు ముండ్లమూరు మండలం ఉల్లగల్లులోనూ ఉద్రిక్తత నెలకొంది. ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఉల్లగల్లు 1, 2 పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ నిలిచిపోయింది.