ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ఏరియాలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి కే వి గిరిధర్ ఆదివారం తెలిపారు. బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారన్నారు. కౌంటింగ్ సక్రమంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాదంపూడిలో స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు


