హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యదర్శి నిర్లక్ష్యం.. చర్యలకు సిఫార్సు!

అనకాపల్లి: కోటవురట్ల మండలం పందూరు పంచాయితీ కార్యదర్శి సత్యనారాయణ విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పందూరు పోలింగ్ కేంద్రంలో ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. ఫోన్‌కు కూడా అందుబాటులో లేరన్నారు.