హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు కోసం స్వగ్రామాలకు చేరుతున్న వలస కూలీలు

KRNL: నందవరం మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు రవాణా ఏర్పాట్లతో కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఒక్కో ఓటు కీలకంగా మారడంతో అభ్యర్థులు వలస ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.