హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో రేపు జాబ్ మేళా

కర్నూలు NAC కేంద్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18–35 ఏళ్ల వయసున్న 10వ తరగతి నుంచి పీజీ అర్హత కలిగిన వారికి 10 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. రూ.14 వేల నుంచి రూ.20 వేల వేతనం ఉంటుందని, అభ్యర్థులు సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్‌తో హాజరుకావాలని అధికారి పీ.దీప్తి తెలిపారు.