దేశ రాజధాని ఢిల్లీలోని విశ్వాస్ నగర్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఈ-రిక్షాలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ భారీ విషాదం జరిగింది. అగ్నికీలలు చుట్టుముట్టడంతో వాటిలో చిక్కుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకోగా, మంటలు చెలరేగడానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
రాజధానిలో విషాదం.. మంటల్లో చిక్కుకుని నలుగురు మృతి


