TG: పామాయిల్ సాగు కోసం ఎకరాకు రూ.46,250 సబ్సిడీ ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పంటతో 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని, అనుకూల పరిస్థితుల్లో ఎకరానికి రూ.2 లక్షల ఆదాయం పొందవచ్చన్నారు. పామాయిల్ గెలల ధర టన్నుకు రూ.12,534 నుంచి రూ.22,658కు పెరిగిందని వెల్లడించారు. ఈ ఏడాది 25,242 మంది రైతుల నుంచి గెలలు కొనుగోలు చేసి వారి ఖాతాల్లో రూ.1,213 కోట్లు జమ చేశామన్నారు.
వార్తలు
పామాయిల్ సాగు.. ఎకరాకు రూ.46,250 సబ్సిడీ


