హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల CMల భేటీ

డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదనపై దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల CMలు ఇవాళ సమావేశం కానున్నారు. ఢిల్లీలో తెలంగాణ, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనపై కాంగ్రెస్ వైఖరిని ఖరారు చేయడంతో పాటు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించనున్నట్లు సమాచారం.