TG: రాష్ట్రంలోని 365 కరవు మండలాల రైతులు డిసెంబర్ 7లోగా ఖరీఫ్ పంట రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య తీసుకున్న రుణాలకు 365 కరవు మండలాల్లో ఈ అవకాశం వర్తిస్తుంది. రీషెడ్యూలింగ్తో అసలు, వడ్డీ చెల్లింపులను ఏడాది పాటు వాయిదా వేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు సంబంధిత బ్యాంకుల్లో సమ్మతి పత్రం సమర్పించాలి.
వార్తలు
పంట రుణాల రీషెడ్యూలింగ్కు అవకాశం


