హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: కరీంనగర్‌లోని విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా ఆదివారం పలు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు టౌన్-2, కొత్తపల్లి ADEలు లావణ్య, రఘు తెలిపారు. తిరుమల టాకీస్, మడేలేశ్వర స్వామి టెంపుల్, వసుధ హోటల్ లైన్ ఏరియాల్లో ఉ.10 నుండి మ.12 వరకు, కమాన్పూర్, బద్దిపల్లి, నాగులమల్యాల గ్రామాలు, వ్యవసాయ సర్వీసులు, గ్రానైట్ పరిశ్రమలకు ఉ.9:30 నుంచి సా.5గం. కరెంటు ఉండదన్నారు