హైదరాబాద్: 28°C
వార్తలు

బావర్చి కేసు: అరెస్టు వద్దని ఆదేశం

HYD: చిక్కడపల్లి బావర్చి హోటల్ ఘర్షణ కేసులో బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, ముత్తా జయసింహ సహా ఆరుగురిని అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు శనివారం పోలీసులను ఆదేశించింది. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు వెంకట తేజ ఫిర్యాదుపై చిక్కడపల్లి పోలీసులు శాంతిభద్రతల భంగం, అల్లర్ల సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కొన్ని గంటలకే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.