హైదరాబాద్: 28°C
వార్తలు

'టీకాల కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలి'

SRCL: జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సిరిసిల్లలోని సంజీవయ్య నగర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అవుట్ రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అర్హులైన చిన్నారులందరికీ సకాలంలో టీకాలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కనకదుర్గ కంటి ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను సమీక్షించారు.