హైదరాబాద్: 28°C
వ్యాపారం

లావాదేవీ ఫెయిలైతే ఛార్జీలు వేయొద్దు: RBI

ATMలలో సాంకేతిక సమస్యలు, కనెక్టివిటీ లోపాలు లేదా నగదు లేకపోవడం వల్ల లావాదేవీ విఫలమైతే ఖాతాదారులపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదని RBI స్పష్టం చేసింది. అంతేకాదు, ఇలాంటి ఫెయిలైన లావాదేవీలను నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిలోనూ లెక్కించకూడదని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. బ్యాంకు లేదా సర్వీస్ ప్రొవైడర్ వైఫల్యాల వల్ల జరిగే లావాదేవీలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.