ATM నగదు ఉపసంహరణలు, ఛార్జీలపై RBI కీలక సూచనలు చేసింది. సొంత బ్యాంకు ATMలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ATMలలో మెట్రో నగరాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5 ఉచితం. నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ చెకింగ్ కూడా దీనిలోకే వస్తాయి. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23తో పాటు పన్నులు చెల్లించాలి. ఇతర బ్యాంకుల ATMలలో ఒక్కోసారి గరిష్ఠంగా రూ.10 వేలే తీసుకోవచ్చు.
వ్యాపారం
ATM లావాదేవీలపై RBI కొత్త మార్గదర్శకాలు


