హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రానికి 3 రోజులు వర్ష సూచన

AP: యానాం మీదుగా రాష్ట్రం వైపు ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి వల్ల పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు.. మార్కాపురం, ప్రకాశం, మిగతా రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వెల్లడించింది.