హైదరాబాద్: 28°C
వ్యాపారం

తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న రెండుసార్లు పెరిగిన బంగారం ధరలు, ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గి రూ.1,27,860కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 దిగొచ్చి రూ.1,17,200 ఉంది. అటు కిలో వెండి ధర రూ.1,70,000ల వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.