హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుప్త నిధుల కోసం అన్వేషణ.. ఐదుగురి అరెస్టు

BHPL: చిట్యాల మండలం నైనపాక శివారులో గుప్త నిధుల కోసం యంత్రంతో అన్వేషిస్తున్న ఐదుగురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్ తెలిపారు. నైనపాక గ్రామానికి చెందిన కంచర్ల సాంబయ్య, శ్రీపతి అశోక్, చిటుకూరి రాజు, మూడెడ్ల తిరుపతి, సంగీ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.