MBNR: జడ్చర్ల పట్టణంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, పొదలు పెరిగినా, చెత్త పేరుకుపోయినా యజమానుల వివరాలతో మున్సిపాలిటీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్ సూచించారు. ఫిర్యాదుల ఆధారంగా యజమానులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. నిర్ణీత గడువులోగా స్థలాలను శుభ్రం చేయకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
ఖాళీ స్థలాల యజమానులకు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక


