హైదరాబాద్: 28°C
వ్యాపారం

విమానయాన కంపెనీల్లో అదానీ పెట్టుబడులు

దేశీయ విమానయాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని అదానీ గ్రూప్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ కంపెనీ సీఎఫ్‌వో జుగేశిందర్ రాబీ సింగ్ వివరాలు వెల్లడించారు. భారత్‌లో విమాన ప్రయాణాలకు భారీ అవకాశాలున్నాయని తెలిపారు. వాటిని పూర్తిస్థాయిలో అందుకోవాలంటే విమానయాన రంగంలో మరింత విస్తరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. విమానయాన అభివృద్ధికి తామూ తోడ్పడాలని భావిస్తున్నట్లు తెలిపారు.