హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

ఆసిఫాబాద్: తిర్యాని మండలం దాభగూడ గ్రామంలో పురుగుల మందు తాగి ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. స్థానికుల వివరాలు గ్రామానికి చెందిన ఆడ బొజ్జిరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థులను కలచివేశాయి.