హైదరాబాద్: 28°C
తెలంగాణ

రవి పుష్యామృత యోగం.. కొనుగోళ్లకు శుభదినం

SRD: ​ఈ నెల 29న ఆదివారం పుష్యమి నక్షత్రం కలయికతో 'రవి పుష్యామృత యోగం' ఏర్పడనుందని నారాయణఖేడ్ వేదపండితుడు గురురాజ శర్మ శనివారం తెలిపారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ రోజున బంగారం, వెండి, వజ్రాభరణాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందన్నారు. అలాగే ముఖ్యమైన ఆర్థిక, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అత్యుత్తమ సమయమని వివరించారు.