ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంచీ-పట్నా హైవేపై స్కార్పియో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో 13 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. బిహార్‌లోని నలందా నుంచి రజరప్ప ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
వార్తలు
స్కార్పియో బోల్తా.. 13 మంది మృతి


