హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ, టోల్‌ చెల్లించేందుకు ఆగిన కారును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా, 15 ఏళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. మృతులు బెంగళూరు నుంచి స్వగ్రామానికి ఓటు వేసేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.