KMM: కేసీఆర్ దీక్షకు గుర్తుగా నిర్వహించే దీక్షా దివస్ను వైరా నియోజకవర్గంలో విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేత లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇంఛార్జి ఆర్జేసీ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు వైరాలోని ఇండోర్ స్టేడియం ఎదురుగా ఉన్న రింగ్ రోడ్డు సెంటర్లో కార్యక్రమం జరగనుంది. అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.