KNR: కరీంనగర్లో నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సెల్ఫీ బూత్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సభకు వచ్చే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సెల్ఫీ బూత్ వద్ద ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
తెలంగాణ
దీక్షా దివస్ సెల్ఫీ బూత్ ప్రత్యేక ఆకర్షణ


